టోకూరు గ్రామ సచివాలయన్ని ఎంపిడిఓ ఏవివి కుమార్ గురువారం సందర్శించారు. అనంతరం సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నవంబర్ 29నే బ్యాంకులో పింఛను డబ్బులు డ్రా చేసి నవంబర్ 30 ఉదయం 6 గంటల నుండి అన్ని గ్రామ సచివాలయ సిబ్బంది పింఛన్లను పంపిణీ చేయాలని పేర్కొన్నారు. డిసెంబర్ ఒకటి ఆదివారం కావడంతో నవంబర్ 30నే పింఛన్లు పూర్తి దశల్లో పంపిణీ చేసే విధంగా చర్యలు చేపడుతున్నమన్నారు.