పర్యటక కేంద్రమైన అరకులోయలో ఉన్న గిరిజన మ్యూజియానికి ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. 3 రోజులపాటు సంక్రాంతి సెలవుల కారణంగా దేశంలోని నలుమూలల నుంచి అరకులోయ ప్రాంతంలోని మన్యం అందాలను తిలకించేందుకు భారీసంఖ్యలో పర్యటకులు తరలివచ్చారు. గిరిజన మ్యూజియంలో ఉన్న గిరిజనుల జీవన స్థితిగతులను అద్దంపట్టేలా ఉన్నా విగ్రహాలు వ్యవసాయ విధానాలు చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. పర్యటకులతో ఇదే తరహా సందడి పలు ప్రాంతాల్లో నెలకొంది.