పాఠశాల ఆవరణలో వనసంరక్షణ కార్యక్రమం

60చూసినవారు
పాఠశాల ఆవరణలో వనసంరక్షణ కార్యక్రమం
అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలంలో పెదకోడాపల్లి పంచాయతీకి చెందిన తులభరంగి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లో మంగళవారం ఉపాధ్యాయులు కొర్రా క్రిష్ణారావు మరియు విద్యార్థులు కలిసి కొన్ని మొక్కలను నాటడం జరిగింది. మొక్కల సంరక్షణ కోసం పిల్లలకు తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా పాఠశాల ఆవరణలో కంచె ఏర్పాటు విషయంలో చర్యలు తీసుకొనుటకు ముందుకు సాగాలని ఉపాధ్యాయులు నిర్ణయించడం జరిగింది.

సంబంధిత పోస్ట్