అల్పపీడన ప్రభావంతో నాలుగు రోజులుగా కురుస్తున్న మోస్తారు వర్షానికి హుకుంపేట మండలంలోని చీకుమద్దుల పంచాయతీ పరిధి నందిపుట్టులో కొర్ర బుజ్జన్న అనే గిరిజనుడికి చెందిన పెంకుటిల్లు బుధవారం అర్ధరాత్రి కూలిపోయింది. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదన్నారు. ప్రభుత్వమే గుర్తించి ఆశ్రయం కోల్పోయిన బొజ్జన్న కుటుంబాన్ని నష్టపరిహారం ఇప్పించి ఆదుకోవాలని పంచాయతీ వైస్ సర్పంచ్ ఉత్తరాన గురువారం కోరారు.