పెదబయలు మండలంలోని మూడు రోజుల నుంచి కురిసిన భారీ వర్షానికి పెదకోడపల్లి పంచాయతీ పరిధి మల్లెపుట్టు నుండి వనగారాయి వరకు ఇటీవల నిర్మిస్తున్న సిసి రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామని ఆయా గ్రామాల గిరిజనులు వాపోతున్నారు. ఈ సమస్యపై సంబంధిత గుత్తేదారు అధికారులు స్పందించాలని ఆదివారం ఉదయం వారు కోరారు.