తప్పిపోయిన బాలుడిని అరకులోయ పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. డుంబ్రిగుడ మండలంలోని పుట్టబంధకి చెందిన మొధోన్ కుమారుడు పోతురాజు(3) అరకు శుక్రవారం వారపు సంతకు తల్లిదండ్రులతో వచ్చి తప్పిపోయాడు. బాలుడు ఒంటరిగా ఏడుస్తుండటాన్ని గమనించిన స్థానికులు అరకులోయ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అరకులోయ ఎస్ఐ సంతోష్ తల్లిదండ్రులను పిలిపించి బాలుడిని అప్పగించారు. ఎస్ఐకు బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు చెప్పారు.