భారీ వర్షానికి ఎగిరిపోయిన ఇంటి పైకప్పు రేకులు

58చూసినవారు
భారీ వర్షానికి ఎగిరిపోయిన ఇంటి పైకప్పు రేకులు
పెదబయలు మండలంలోని ఆదివారం భారీగా వీచిన ఈదురుగాలులకు పెదకోడపల్లి పంచాయతీలోని ఆండ్రవర గ్రామంలో పాంగి. లింగేష్ అనే గిరిజనుడికి చెందిన ధాన్యం మిల్లు కోసం నిర్మించిన రేకుల ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోయి పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే ఆ సమయంలో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ప్రభుత్వ అధికారులే గుర్తించి తనకు పరిహారం ఇప్పించాలని బాధిత రైతు లింగేష్ కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్