అనంతగిరి మండలం చిలకలగెడ్డ సెక్టార్ చీడివలస అంగన్వాడి కేంద్రంలో గురువారం ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి సంతోషి కుమారి, సూపర్వైజర్ శాంతి ప్రియ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ ఆగస్టు 1 నుండి 7 వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తామన్నారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించి గర్భిణీలు, బాలింతలకు తల్లిపాలు అందించే విధానం, వాటి యొక్క ఉపయోగల పై క్లుప్తంగా అవగాహన కల్పించారు.