రైతు బాగుంటేనే సమాజం బాగుంటుందని జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ అభిప్రాయపడ్డారు. వ్యవసాయ, అనుబంధ రంగాలలో పెట్టుబడులను తగ్గించి, అధిక దిగుబడిలతో రైతులకు లాభసాటి వ్యవసాయం చేయడమే పొలం పిలుస్తోంది ముఖ్య ఉద్దేశ్యమని కలెక్టర్ పేర్కొన్నారు. భీమిలి మండలం రాజుల తాళ్ల వలసలో పొలం పిలుస్తోంది కార్యక్రమం మంగళవారం జరిగింది.