ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్‌ను చోడవరం నియోజకవర్గ ఇన్ చార్జ్ పివిఎస్ఎన్ రాజు బుధవారం అమరావతిలో మర్యాద పూర్వకంగా కలిశారు. చోడవరం నియోజకవర్గంలోని చలిసింగం గిరిజన గ్రామానికి రోడ్డు ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందించారు. పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించి, కొండపైన ఉన్న గ్రామానికి తక్షణ రోడ్డు ఏర్పాటు అవసరాన్ని గుర్తించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని రాజు పేర్కొన్నారు.