విశాఖ స్టీల్ ప్లాంట్ మూసివేతకు కుట్ర జరుగుతోందంటూ కూటమి సర్కారుపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. కూటమి వంద రోజుల పాలన మాటలకే పరిమితమయిందని.. పెన్షన్ తప్ప ఏ హామీ అమలు కాలేదని విమర్శలు గుప్పించారు. స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు.