విశాఖ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పలుచోట్ల స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొని జండా వందనం చేశారు. గురువారం ఆమె మూడసరిలోవ స్కిల్ డెవలప్మెంట్ ప్రాంతంలో, పెదగదిలి శ్రీకృష్ణ యువజన సేవా సంఘం వారి ఆధ్వర్యంలో తదితర ప్రాంతాలలో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ ఎంతోమంది ప్రాణ త్యాగంతో మన దేశానికి స్వతంత్రం వచ్చిందని కొనియాడారు.