ఎర్ర మట్టి దిబ్బలను ఆనుకొని ఉన్న నేరెళ్ల వలస గ్రామంలో భీమునిపట్నం మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ కి ఇచ్చిన భూములను రద్దు చేయాలంటూ విశాఖ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఇచ్చిన పిటిషన్ పై ప్రభుత్వం స్పందించింది. దీనిపై సమగ్రంగా, సహేతుకంగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ను గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ విషయాన్ని కార్పొరేటర్ మూర్తి యాదవ్ వెల్లడించారు.