జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ కు వినతి

70చూసినవారు
జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ కు వినతి
విశాఖ జిల్లాలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులు స్థానికంగా పలు సమస్యలు ఎదుర్కొంటున్నారని వాటి పరిష్కారానికి సహకరించాలని కోరుతూ పలు జర్నలిస్టు సంఘాల ప్రతినిదుల బృందం బుధవారం జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ కు కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. జర్నలిస్టుల పిల్లలకు గతంలో మాదిరిగా 50 శాతం పైగా ఫీజు రాయితీ కల్పిస్తూ మెమో ఉత్తర్వులు అలాగే పెండింగ్ లో ఉన్న ప్రెస్ అక్రిడేషన్లు జారీ చేయాలని కోరారు. గత సంవత్సరం మాదిరిగానే వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ కు జర్నలిస్టులు చెల్లించాల్సిన ప్రీమియం సి.ఎస్.ఆర్ కింద చెల్లింపుకు సహకరించాలని ఈ ఏడాది కూడా చెల్లింపుకు గత కలెక్టర్ ఏర్పాట్లు చేశారని ఆయన దృష్టికి తెచ్చారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్