గాజువాక మండలం మింది గ్రామంలో శుక్రవారం మాజీ మంత్రి గుడివాడ గుర్నాథ్ రావు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గురునాథరావు తనయుడు మాజీ మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ ఉమ్మడి విశాఖ జిల్లా అభివృద్ధికి మంత్రిగా గుడివాడ చేసిన కృషి మరువలేనిదని అన్నారు. ఆయన చూపిన బాటలో నడుస్తున్నట్లు పేర్కొన్నారు.