రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం డిసెంబర్ ఒకటి ఆదివారం కావడంతో నవంబర్ 30న ముందస్తు పెన్షన్ల పంపిణి కార్యక్రమం పెద్ద గంట్యాడ మండలంలో ప్రారంభమైంది. తుఫాను ప్రభావం ఉన్న సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు ఇంటింటికి వెళ్లి అర్హులైన పెన్షన్ దారులకు ఉదయం 6 గంటల నుంచి పెన్షన్లు ఇవ్వడం ప్రారంభించారు. ముందస్తుగా పెన్షన్ తీసుకోవడం చాలా ఆనందకరంగా ఉందని పెన్షన్ దారులు తెలిపారు.