దేవరపల్లి: అక్రమ క్వారీలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి

75చూసినవారు
దేవరపల్లి మండలం మారేపల్లి పంచాయతీ పరిధిలో ఎరుకునాయుడు మెట్టవద్ద నిర్వహిస్తున్న అక్రమ నల్లరాయి క్వారీని వెంటనే నిలిపివేయాలని, కొండను గుళ్ళచేసిన మైనింగ్ మాఫియాపై వెంటనే చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి వెంకన్న డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన క్వారీ తవ్వకాలు చేస్తున్న ప్రాంతాన్ని పరిశీలించి మాట్లాడారు. అలాగే వాడపల్లి చినగంగవరం, మారేపల్లిలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారన్నారు