గూడెంకొత్తవీధి మండలంలోని దారకొండ ఘాట్ రోడ్డుపై ఆదివారం పెద్దపులి కనిపించడంతో సీలేరు ఫారెస్ట్ డిప్యూటీ అధికారి సింహాచలం పడాల్ అప్రమత్తమయ్యారు. ఫారెస్ట్ సిబ్బందితో కలిసి దారకొండ ఘాట్ రోడ్డు నుంచి రైన్గేజ్ వరకు పులి ఆచూకీ కోసం గాలించారు. అనంతరం దారకొండలోని వారపు ఆదివారం సంతలో మైకుల ద్వారా పెద్దపులి పట్ల జాగ్రత్త ఉండాలని అప్రమత్తం చేశారు. ప్రజలు ఒంటరిగా తిరగవద్దని సూచించారు.