శ్రావణమాసం రెండో శుక్రవారం పురస్కరించుకొని మాడుగుల మండలం కేజే పురం జంక్షన్లో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి, వాసవి మాత ఆలయాల్లో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆర్ రామ కొండలరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు.