Apr 17, 2025, 17:04 IST/
కొబ్బరికాయ జారి కింద పడితే ఏం జరుగుతుందో తెలుసా..?
Apr 17, 2025, 17:04 IST
శుభకార్యం ప్రారంభించే ముందు కొబ్బరికాయ కొట్టడం ఆనవాయితీ. అప్పడప్పడూ కొబ్బరికాయను పగలగొట్టే సందర్భంలో అది చేతిలోంచి జారి నేలపై పడిపోతుంటుంది. అయితే ఇలా కొబ్బరి కాయ చేతిలో నుంచి జారి కింద పడిపోవడం అశుభమని పండితులు చెబుతున్నారు. పిడికిలోంచి జారి పడితే కుటుంబంలో దుఃఖం, ధననష్టం జరుగుతాయట. అలాగే కొబ్బరికాయ కొట్టేటప్పుడు సగంగా పగిలితే ధనం పెరుగుతుందని చెబుతున్నారు.