అడ్డగుట్ట డివిజన్ పరిధి డీ సెక్షన్లో జరుగుతున్న తాగునీటి పైపైన్ పనులను అదివారం కార్పొరేటర్ లింగాని ప్రసన్నలక్ష్మి పరిశీలించారు. సాధ్యమైనంత త్వరగా అభివృద్ధి పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.