ఒడిశాలోని ప్రసిద్ధ పూరీ జగన్నాథుడి ఆలయంపై ఆదివారం తెల్లవారుజామున డ్రోన్ ఎగరడం కలకలం సృష్టించింది. ఆలయం సహా చుట్టు పక్కల ప్రాంతం ‘నో ఫ్లై జోన్’లో ఉండగా డ్రోన్ కనిపించడంతో ఆలయం భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆ డ్రోన్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియాల్సి ఉంది. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.