అలర్ట్ ఆ జిల్లాలకు వర్ష సూచన

79చూసినవారు
అలర్ట్ ఆ జిల్లాలకు వర్ష సూచన
దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీరాల వెంట అల్పపీడనం కొనసాగుతోందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ తెలిపారు. రాగల 24 గంటల్లో నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలహీనపడే అవకాశముందని, కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు, నేడు అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమగోదావరి, ఏలూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయన్నారు.

సంబంధిత పోస్ట్