విశాఖ జీవీఎంసీలో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 89 వినతులు వచ్చాయని జీవీఎంసీ కమిషనర్ డా. పి. సంపత్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయం పాత సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. మొత్తం 89 అర్జీలు స్వీకరించామన్నారు. సంబంధిత అర్జీలను సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు.