బంగళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం విశాఖలో పలు చోట్ల వర్షం కురిసింది. చలిగాలుల తీవ్రత ఎక్కువైంది. బుధవారం కూడా విశాఖ, అల్లూరి, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో వర్షం కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు మంగళవారం తెలిపారు.