కోటవురట్ల: వర్షాలతో వరి పంటకు తీవ్ర నష్టం

54చూసినవారు
వర్షాలకు కోటవురట్ల మండలంలో పలు గ్రామాల్లో వరి పంట తీవ్రంగా దెబ్బతింది. గత నెలలో కురిసిన వర్షాలకు పొలాల్లో చేరిన నీరు అలాగే ఉంది. ఈ నేపథ్యంలో గత మూడు రోజులు కురిసిన వర్షాలు వేచిన గాలులకు కోతకు వచ్చిన వరి పంట నేలకు ఒరిగింది. పంటను కాపాడుకోవాలనే ఉద్దేశంతో రైతులు మూడు నాలుగు వరి దుబ్బులను కలిపి కట్టారు. కోసి పొలాలపై ఉంచిన పంట సైతం తడిచిపోయిందని శనివారం జల్లూరులో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్