వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ నిర్వాసితుల సమస్యలపై అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ స్పందించాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. అప్పలరాజు విజ్ఞప్తి చేశారు. ఆదివారం నక్కపల్లి మండలం చందనాడలో నిర్వాసితులతో కలిసి మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటులో చూపిస్తున్న శ్రద్ధ నిర్వాసితుల సమస్యల పరిష్కారంలో చూపించడం లేదని ముందు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలన్నారు.