తాజాగా (శనివారం) విడుదలైన ట్రిపుల్ ఐటీలో ప్రవేశానికి సంబంధించిన ఫలితాల్లో కోటఉరట్ల మండలం కె. వెంకటాపురం గ్రామానికి చెందిన విద్యార్థిని తమరాన నేహాసిని అర్హత సాధించింది. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివిన ఈమె 2024 ఫలితాల్లో 567 మార్కులు సాధించింది. ఆర్జేకేయూటీ(RJKUT) పరిధిలోని ఒంగోలు ఐఐఐటీ లో అర్హత సాధించిన ఈమెను హెచ్ఎం షేక్ అల్లావుద్దీన్, ఉపాధ్యాయులు అభినందించారు.