పరవాడ సంతబయల వద్ద గల చెప్పుల షాపులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై షాపు యజమాని పెంట భూషణరావు గురువారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బుధవారం అర్ధరాత్రి రెండు గంటల దాటిన తర్వాత ప్రమాదం జరిగిందన్నారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసినట్లు తెలిపారు అప్పటికే షాపులో మొత్తం సామగ్రి ఖాళీ బూడిద అయిందన్నారు.