పెందుర్తి: రూ. 50 కోట్ల విలువైన భూమి స్వాధీనం

52చూసినవారు
పెందుర్తి: రూ. 50 కోట్ల విలువైన భూమి స్వాధీనం
పెందుర్తి మండలం వేపగుంటలో సింహాచలం దేవస్థానానికి చెందిన రూ. 50 కోట్ల విలువైన 3. 40 ఎకరాల భూమిని శనివారం స్వాధీనం చేసుకున్నట్లు ఈవో త్రినాధరావు తెలిపారు. ఈ భూమికి సంబంధించి ఏపీ హైకోర్టులో పలువురు రిట్ పిటిషన్ వేసినట్లు ఈఓ తెలిపారు. తాము హైకోర్టును ఆశ్రయించగా కోర్టు దేవస్థానానికి అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. కోర్టు ఉత్తర్వులు మేరకు అక్రమదారులకు నోటీసులు పంపించగా స్పందించలేదన్నారు.

సంబంధిత పోస్ట్