పెందుర్తి మండలం వెంకటాపురం కృష్ణానగర్ లో గల దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ 19వ వార్షికోత్సవం శనివారం వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని దుర్గా మల్లేశ్వర స్వామిని దర్శించుకుని విశేష పూజలు నిర్వహించారు. నూతనంగా తయారుచేసిన రథాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు వేద పండితులు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.