పెందుర్తి: తెలుగు శక్తి అధ్యక్షుడికి శారదా పీఠం నోటీసులు

53చూసినవారు
పెందుర్తి: తెలుగు శక్తి అధ్యక్షుడికి శారదా పీఠం నోటీసులు
తెలుగు శక్తి రాష్ట్ర అధ్యక్షుడు బివి రామ్ కు పెందుర్తి కేంద్రంగా గల విశాఖ శ్రీ శారదా పీఠం బుధవారం పరువు నష్టం నోటీసులు జారీ చేసింది. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామిని ఎస్. ఎన్. పాల్ గా సంబోధిస్తూ మాట్లాడడంతో పాటు స్వామీజీపై మతానికి సంబంధించి ఆరోపణలు చేస్తున్నారని న్యాయస్థానంలో పరువు నష్టం దావా వేసినట్లు పీఠం ప్రతినిధులు తెలిపారు. కాగా ఇప్పటివరకు నోటీసులు అందలేదని రామ్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్