అడ్డతీగల మండలం ఎల్లవరం పంచాయతీలోని రాజవరంనకు చెందిన ఆక్రమిత నూకన్న చెరువును బుధవారం అడ్డతీగల తహశీల్దార్ సూర్యారావు పరిశీలించారు. చెరువు దగ్గరకు వెళ్లడానికి దారి లేకపోవడంతో నాయుడుపాకల గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేటు వ్యక్తి చెరువు ఆక్రమణ చేసి వరి పొలం వేయడం, ఆయకట్టు రైతులు ఈ చెరువు ఆక్రమణ వల్ల దారి లేక పడుతున్న ఇబ్బందులు తమ దృష్టికి వచ్చినట్టు తెలిపారు.