వి. ఆర్ పురం మండలంలోని రేఖపల్లి గ్రామం మధ్యలో మద్యం దుకాణం ఏర్పాటు చేయడంపై మహిళలు మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం షాపు ఏర్పాటు చేసిన ప్రాంతంలో సాయిబాబా గుడి, ప్రార్థన మందిరం, ప్రభుత్వ పీహెచ్సీ హాస్పిటల్ ఉన్నాయన్నారు. ఈ సమస్యను ఎమ్మార్వో దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మద్యం దుకాణాన్ని దూరంగా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.