రామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాలలో ఈ నెల 15న ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞేయానందజీ తెలిపారు. రంపచోడవరంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. గుండె సంబంధిత వ్యాధులు, బిపి, షుగరు, చెవి, ముక్కు, గొంతు, ఎముకలు, కీళ్లు, ఫిట్స్, చర్మ వ్యాధులతో పాటు స్త్రీల వ్యాధులపై ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తామన్నారు.