మండల కేంద్రమైన అడ్డతీగల లోని స్థానిక బస్టాండ్ వద్ద సోమవారం జనసేన జెండా ను ఆవిష్కరించనున్నట్లు జనసేనా పార్టీ సభ్యులు తాటికొండ రాజేంద్ర ఆదివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ " బైక్ ర్యాలీ , జెండా ఆవిష్కరణ అనంతరం నియోజవర్గ స్థాయి సమావేశం ఉంటుందని కావున రంపచోడవరం నియోజవర్గ జనసేన పార్టీ అన్ని మండలాల అధ్యక్షులు, కార్యకర్తలు, జిల్లా కమిటీ సభ్యులు, వీర మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.