విజయవాడను ముంచెత్తిన వరదల్లో చనిపోయిన వారివి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే అని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ స్పష్టం చేశారు. నగరాన్ని వరద ముంచెత్తబోతోందని ప్రభుత్వానికి స్పష్టమైన సమాచారం ఉన్నా, ప్రజలను అప్రమత్తం చేయలేదని, ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టలేదని, మరోవైపు వరద బాధితులను ఆదుకోవడంలోనూ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ఆయన ఆక్షేపించారు. విశాఖలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.