కూటమి ప్రభుత్వంలో ఏపీ అభివృద్ధి చెందుతుందని మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు ఉద్ఘాటించారు. శనివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ. 11, 440 కోట్ల ప్యాకేజీ వరాన్ని ఇచ్చారని చెప్పారు. ఈ సందర్భంగా మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు.