కరెంటు చార్జీల బాదుడుపై ఈనెల 27వ తేదీన వైసీపీ అధిష్టానం ఇచ్చిన పిలుపుమేరకు చేపడుతున్న పోరుబాటను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ పిలుపునిచ్చారు. విశాఖ ఆశీలమెట్ట కార్యాలయంలో మంగళవారం దక్షిణ వైసీపీ శ్రేణులు కార్యకర్తలతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ముందుగా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు.