కొద్ది రోజుల కిందట వైసీపీకి రాజీనామా చేసిన విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్, ఎలమంచిలి మున్సిపల్ చైర్ పర్సన్ రమాకుమారి, డైరీ డైరెక్టర్లు. బుధవారం రాజమండ్రిలో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సమక్షంలో బిజెపిలోకి చేరుతున్నట్లు పిల్ల రమాకుమారి మంగళవారం తెలియజేశారు. పట్టణంలోని స్వర్గీయ ఆడారి తులసిరావు ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన ఆత్మీయుల సమావేశంలో ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.