విశాఖ డెయిరీ చైర్మన్ ఆనంద్ కుమార్ తో పాటు డెయిరీ డైరెక్టర్లు 12 మంది, ఆయన సోదరి ఎలమంచిలి మున్సిపల్ చైర్ పర్సన్ రమాకుమారి బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం విజయవాడ పార్టీ కార్యాలయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి సమక్షంలో వారు బిజెపిలో చేరారు. వారందరికీ పురందేశ్వరి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనకాపల్లి విశాఖ జిల్లాల బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.