ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దివ్యాంగ చిన్నారుల తల్లిదండ్రులకు పది నెలలుగా బకాయి పడ్డ రవాణా ఛార్జీల నగదును ఒక్కొక్కరికి రూ.3000 చొప్పున ప్రభుత్వం జమ చేసింది. తమ కష్టాన్ని అర్థం చేసుకున్న ప్రభుత్వం నగదును ఖాతాలకు జమ చేయడంపై దివ్యాంగ తల్లిదండ్రులు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. నగదు జమ అయిందో కాలేదో మీ ఖాతాలను సరి చూసుకోండి.