అంబ‌టి రాయుడు షాకింగ్ కామెంట్స్‌

37216చూసినవారు
అంబ‌టి రాయుడు షాకింగ్ కామెంట్స్‌
ఏపీలో ఎన్నికల రాజకీయం క్రమంగా వేడెక్కుతోంది. రాజకీయ నేతల మధ్య మాటల యుద్దం పెరుగుతుండగా.. తాజాగా క్రికెట్ ను వదిలి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అంబటి రాయుడు కూడా ఇందులో చేరిపోయారు. వైసీపీలో బానిసత్వం తప్ప మరొకటి లేదని అంబటి రాయుడు విమర్శించారు. ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా జగన్ కాలి కింద చెప్పులా బ్రతకాల్సిందేనన్నారు. ఆయనకు బటన్ నొక్కడం తప్ప అభివృద్ధి చేతకాదన్నారు. బటన్ తో పాటుగా బొచ్చె కూడా ఇస్తాడన్నారు. జగన్ కి మళ్ళీ అధికారం ఇస్తే పాతాళానికే అన్నారు.

సంబంధిత పోస్ట్