షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ పై సుప్రీంకోర్టు వెలువరించిన కీలక తీర్పును అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు ఎంపి సీఎం రమేష్ స్వాగతించారు. ఈసందర్భం
గా గురువారం ఆయన ఒక ప్రకటన విడుదలచేశారు. ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం రిజర్వేషన్ కోటాను ఉప వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పించడం పట్ల రమేష్ హర్షం వ్యక్తం చేసారు. అందరికి సమాన అవకాశాలు కల్పించాలనే హక్కు అందరికీ లభిస్తుందన్నారు.