అరకు: తారురోడ్డు నిర్మించాలని గిరిజనులు పాదయాత్ర
అరకులోయ మండలంలోని బస్కి పంచాయతీలోని గిర్లిగుడ నుండి పరిశీల వరకు తారురోడ్డు నిర్మాణం చేపట్టాలని గిరిజనులు బుధవారం 4 కిలోమీటర్ల పాదయాత్ర చేసి నిరసన వ్యక్తం చేశారు. సీపీఎం పార్టీ మండల కార్యదర్శి రామరావు మాట్లాడుతూ.. గిర్లిగుడ నుండి పరిశీల వరకు సరైన రహదారి సౌకర్యం లేక డుంబ్రిగుడతోపాటు పాడేరు జిల్లా కేంద్రానికి గిరిజనులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అధికారులు స్పందించాలని కోరారు.