పర్యటక కేంద్రమైన అరకులోయకు సంక్రాంతి శోభ సంతరించుకుంది. ఈనెల 13వ తేదీ నుంచి 15వ తేది వరకు సంక్రాంతి పండగ జరుగు నేపథ్యంలో సుదూర ప్రాంతాల నుంచి ఆయా గ్రామాల ప్రజలతోపాటు దేశంలోని నలుమూలల నుంచి పలువురు సందర్శకులు అరకులోయకు తరలిరావడంతో శనివారం రాత్రి అరకులోయలోని రహదారులన్నీ రద్దీగా కనిపించాయి. వస్త్ర బంగారు వెండి దుకాణాలు కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి. పలు లాడ్జిలలో పర్యాటకులతో కిక్కిరిసిపోయింది.