అరకులోయ మండలంలోని మాదల పంచాయతీ పరిధి దోమలజోరుకి వెళ్లే రహదారికి నిర్మాణం చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. రహదారి నిర్మాణం కొరకు 5 సంవత్సరాల క్రితం మట్టిరోడ్డుపై కంకరబుగ్గి పోసి రహదారి నిర్మాణ పనులు అర్ధాంతరంగా విడిచిపెట్టడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గిరిజనులు వాపోతున్నారు. అధికారులు స్పందించి అర్ధాంతరంగా విడిచిపెట్టిన ఈ రహదారికి నిర్మాణం చేపట్టాలని మంగళవారం కోరారు.