ముంచంగిపుట్టు మండలంలోని చలి చంపేస్తోంది. కొన్ని రోజులుగా చలి తీవ్రత తగ్గడం లేదు. ఉదయం సాయంత్రం చలిగాలులకు జనం ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. మండలంలోని బూసిపుట్ పరిసర ప్రాంతంలో మంగళవారం వేకువజాము నుంచి ఉదయం 10 గంటల వరకు దట్టమైన పొగమంచు కమ్ముకొని దట్టంగా మంచు కురవడంతో గిరిజనులు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. చలి తీవ్రతతో గిరిజనులు చలి మంటలతో ఉపశమనం పొందుతున్నారు.