ఆంధ్రకశ్మీర్ గా పేరుగాంచిన అరకులోయలో ఉన్న గిరిజన మ్యూజియానికి మంగళవారం రాత్రి పర్యాటకుల తాకిడి పెరిగింది. ఏజెన్సీ ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతు ఉదయం పూట దట్టంగా పొగమంచు కమ్ముకొని పొగమంచు అందాలు కనువిందు చేస్తున్నాయి. దీనికి తోడు సంక్రాంతి సెలవులు కలిసి రావడంతో ప్రపంచంలోని నెదర్లాండ్ తోపాటు దేశంలోని నలుమూలల నుంచి పర్యాటకులు అరకులోయలోని సందర్శన ప్రాంతాలను సందర్శించి ఫిదా అవుతున్నారు.