భీమిలి నియోజకవర్గంలో వర్షాలకు విద్యుత్ స్తంభాలు నేలకొరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఉప్పాడ అప్పారావు శనివారం ఉదయం అన్నారు. చాలా ప్రాంతాల్లో పాతకాలం నాటి సిమెంట్ స్తంభాలు ఉన్నాయని, వర్షాలకు బాగా నానడంతో శిథిలావస్థకు చేరుతున్నాయన్నారు. వాటిని అలాగే వదిలేస్తే కూలిపోయే ప్రమాదముందని, ముప్పు తప్పించేందుకు పాత కరెంటు స్తంభాల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు.